Satyendra Das | తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారయ్యే ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ (Chief Priest of Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్లి.. లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తుంటారని చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన పరిశీలనలో మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిసినట్లు తేలిందన్నారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
#WATCH | On Tirupati Prasadam row, Chief Priest of Ram Janmabhoomi, Acharya Satyendra Das says, “It is clear from the checking that was done that fish oil was mixed…It is still not known when all this has been happening. This is a conspiracy and an attack on Sanatan Dharma. The… pic.twitter.com/9Os2TyPrEe
— ANI (@ANI) September 20, 2024
తిరుమల లడ్డూపై వివాదం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ (ఎన్డీడీబీజీ) సీఏఎల్ఎఫ్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఈ ఏడాది జూలైలో లడ్డూను ల్యాబ్‌కు పంపగా, అదే నెల 17న నివేదిక వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో ఆవు నెయ్యి, సో యాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మకజొన్న, పత్తి గింజలతోపాటు చేపనూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఆ రిపోర్టును గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు.
నిత్యం 300-500 లీటర్ల నెయ్యి వాడకం
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిని టీటీడీ మారెటింగ్ విభాగం కొనుగోలు చేస్తుంది. ప్రతి ఆరు నెలలకొకసారి టెండర్లు పిలిచి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నిత్యం 300-500 లీటర్ల నెయ్యి వినియోగిస్తారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉన్నది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నె య్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నది. 2021 మార్చి వరకు నందిని బ్రాండ్ (కర్ణాటక) నెయ్యి సరఫరా అయ్యేది. తకువ ధరకి సరఫరా చేయలేమంటూ నందిని తప్పుకున్నది. ఆ తర్వాత యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్-1గా, ఎల్-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందాయి. కేజీ నెయ్యి రూ.424 ప్రకారం టీటీడీకి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Also Read..
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ.. జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు
Tirumala | గత ఐదేళ్లు మహాపాపం జరిగిపోయింది.. తిరుమల లడ్డూ వివాదంపై రమణ దీక్షితులు ఆవేదన
Pawan Kalyan | ఆ సమయం ఆసన్నమైంది.. తిరుమల లడ్డూ వివాదంపై మండిపడ్డ పవన్ కల్యాణ్