అమరావతి : ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం, సహచర ఎంపీలకు ఆయన రాసిన లేఖలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు సహకారం, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సీఎం జగన్ కేంద్ర మంత్రుల భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.