తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై నుంచి తరచూ విమానాలు తిరుగుతుండటంత తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం ఆలయం గోపురం మీదుగా ఓ విమానం వెళ్లింది. దీని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటుంటి రాకపోకలు సాగించకూడదు. అయితే ఈ విధంగా తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమల గోపురంపై నుంచి విమానాలు వెళ్లడంపై ఆలయ అధికారులు ఇప్పటికే పలుసార్లు కేంద్రవిమానాయన శాఖకు విజ్ఞప్తి చేసింది. కనీసం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో కాకుండా తిరుమల గగనతలంలో ఇతర ప్రదేశాల నుంచి విమానాల రాకపోకలు సాగించాలన్న టీటీడీ వినతులను విమానాయన శాఖ పట్టించు కోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా, హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందని.. దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు జరుగకుండా చూస్తామని తెలిపారు.