అమరావతి : వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని (Perninani) కుటుంబ సభ్యుల గిడ్డంగి నుంచి రేషన్ బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ నాయకుల ఆగడాలను ఎన్నటికీ ఉపేక్షింబోమని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని స్కామ్‌లు వెలికి తీస్తుందని పేర్కొన్నారు.
పేదలకుచెందిన బియ్యాన్ని (Ration Rice) బొక్కింది వాస్తవమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. 3708 బస్తాలు, 90లక్షలు ఖరీదు చేసే 187 టన్నుల బియ్యాన్ని పోర్టు ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపించారు. నీతి కబురులు చెప్పే పేర్నినాని కేసు నమోదు తరువాత అడ్రస్‌లేకుండా గల్లంతయ్యారని విమర్శించారు. బియ్యం దొంగతనం జరిగింది వాస్తవమేనని అంగీకరించి దాని డబ్బులు కట్టేస్తామని లెటర్ ఇచ్చారని తెలిపారు. దొంగతనం చేసి డబ్బులు కట్టేసి దొర అయిపోయి సచ్చీలురు కాడని అన్నారు.
పేర్నినాని సతీమణి జయసుధ పేరుపై ఉన్న రెండు గోదాముల నుంచి బియ్యం మాయం, కేసు నమోదు తరువాత జయసుధపై పోలీసులు లుకౌవుట్ ( Lookout Notice ) నోటీసులు జారీ చేశారు. గిడ్డంగిలోని ప్రస్తుతం నిలువ ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు మచిలీపట్నం మార్కెట్‌యార్డ్‌కు 8 లారీల ద్వారా తరలించారు. బియ్యం తరలించాక గిడ్డంగిని అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టనున్నారు.