అమరావతి : తిరుపతిలోని(Tirupati) తిరుచానూరు శిల్పారామం( Shilparamam) లో విషాదం చోటు చేసుకుంది. ఫన్రైడ్లో భాగంగా జాయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి క్రాస్వీల్ 20 అడుగుల పైనుంచి కిందపడింది. అందులో ఉన్న లోకేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను నిర్వాహకులు తిరుపతి రుయా ఆస్పత్రికి (Ruya Hospital) తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.