Tragedy | నిరుపేద వృద్ధ మహిళ చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. దీంతో చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థితి వచ్చింది. ఏపీలోని మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) భర్త, కూతురు కొన్నాళ్ల కిందట మృతిచెందారు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఇటీవల రాధమ్మ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె బంధువులు భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆమె చనిపోయారు. రాధమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేటు వాహనాన్ని సంప్రదించారు. రూ.2500 అవుతుందని చెప్పడంతో.. అంత మొత్తం చెల్లించే స్తోమత లేక చెత్త సేకరించే రిక్షా బండిలోనే ఇంటికి తరలించారు.
ఇలా ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో మృతదేహాన్ని చెత్త రిక్షాలో తరలించిన ఘటన ఏపీ వ్యాప్తంగా వైరల్గా మారింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మృతదేహాలను తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని అసమర్థ ప్రభుత్వం.. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని విమర్శిస్తున్నారు.
ఏపీలో హృదయవిదారక ఘటన
ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపు
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
పరిస్థితి విషమించి రాదమ్మ మరణించగా,… pic.twitter.com/RaZJWeZpY0
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2025