రైతులు అధైర్యపడొద్దు
అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు.
- సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
- అందెలో దెబ్బతిన్న పంటల పరిశీలన
మిరుదొడ్డి, ఫిబ్రవరి 24: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
గ్రామాల్లో పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తారన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల నష్ట పరిహారంతో పాటు సబ్సిడీ విత్తనాలు అందించాలని గ్రామస్తులు ఆమెకు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో అందె సర్పంచ్ కడారి యాదగిరి, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి ఇంద్రసేనారెడ్డి, దుబ్బాక ఏడీఏ మల్లయ్య, మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం, ఉప సర్పంచ్ పరశురాములు, అందె గ్రామస్తులు సూకురి లింగం, శంకర్, ప్రవీణ్, మహేశ్, రాజేందర్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

