అమరావతి : ఏపీలోని కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు (Lorry Tyre) ఒక్కసారిగా పేలిపోయింది.
దీంతో లారీ అదుపుతప్పి పక్క నుంచి వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లడంతో కారులో ఉన్న ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులు సోమశేఖర్, శ్రీనివాస్, బండ శ్రీనుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Chittoor | ఆగివున్న టిప్పర్ను ఢికొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు దుర్మరణం