అమరావతి : విశాఖ ( Visaka ) అందాలు తిలకించేందుకు వచ్చిన ఓ విదేశీయుడిపై ఆకతాయిలు దాడి చేసిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్ ( Switzerland ) దేశానికి చెందిన నోహ ఎలియస్(24) యారాడ కొండపై గూగుల్ మ్యాప్(Google Map ) ఆదారంగా ట్రెక్కింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అతన్ని అటకాయించి బెదిరించారు.
అతడి భుజంపై దాడిచేసి మొబైల్(Phone) ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు న్యూపోర్ట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.