విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్‌లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షోరూంతోపాటు సర్వీసింగ్ షెడ్ (Servicing Center)కు కూడా వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. అయితే అప్పటికే షో రూమ్ మొత్తం దగ్ధమయింది.
ఈ ప్రమాదంలో షో రూమ్‌లో ఉన్న 500లకుపైగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసే నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని వాచ్ మెన్ ఫోన్ చేశాడని షోరూం యజమాని సతీష్ చెప్పారు. షో రూమ్‌లో 500 కొత్త ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, షోరూం వెనకున్న సర్వీస్ సెంటర్లో 150 వరకు బైకులు ఉన్నాయని పేర్కొన్నారు. సర్వీస్ వాహనాలు, కొత్త వాహనాలు కలిపి మొత్తం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కొత్త వాహనాలకు ఇన్సూరెన్స్ పూర్తిగా వస్తుందని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Motorbikes gutted in fire at a bike showroom in Vijayawada, Andhra Pradesh pic.twitter.com/aO14raASOk
— ANI (@ANI) August 24, 2023