విజయవాడ : (AP Intermediate) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు సిలబస్‌ను తగ్గించింది. మొదటి, రెండో ఏడాది సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యాశాఖ మండలి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో 2020-21 కి గాను సీబీఎస్ఈ ఇప్పటికే 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. సీబీఎస్ఈ బాటలోనే ఏపీ ఇంటర్ బోర్డు కూడా నడిచి ఇక్కడ కూడా 30 శాతం సిలబస్‌ను కుదిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. ఇటీవలనే జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, పని దినాలు చాలా మటుకు గడిచిపోవడంతో సిలబస్‌ను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొన్నది. దాంతో 30 శాతం సిలబస్ తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తొలగించిన సిలబస్‌ను కళాశాలల్లో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య బోధించేలా చర్యలు తీసుకోవాలని కళాశాలలకు ఇంటర్ బోర్డ్ సూచించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని, అందుకని విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. సబ్జెక్ట్‌లవారీగా కుదించిన సిలబస్‌ను బోర్డు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసింది.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..