మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 20:33:35

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల : అవతారోత్సవాలను పుర‌స్క‌రించుకుని శ్రీ సుందరరాజ స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర  వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. 

శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని తిరుచానూరుకు తీసుకొచ్చిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ అవ‌తారోత్స‌వాలు నిర్వ‌హిస్తుంటారు.logo