అమరావతి : ఏపీలో అన్న క్యాంటీన్ల (Anna Canteens) ను తిరిగి పెద్ద సంఖ్యలో ప్రారంభిస్తున్నామని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (Video Conferance) లో ఆయన అన్న క్యాంటీన్లు, మున్సిపల్ డ్రైన్లుపై చర్చించారు.
ఈనెల 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 33 మున్సిపాలిటీల్లో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీను భవనాల నిర్మాణం తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
Read more :
Police Case | గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు
Pithapuram | వైసీపీకి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే!