కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల (Nomination ) పర్వం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో జడ్పీటీసీ ఎన్నికల అధికారి పురుషోత్తం నాయక్, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీటీసీ ఎన్నికల అధికారులుగా రాథోడ్ రమేష్, సాంబమూర్తి, ఎంపీవో శేఖ్ సఫ్దర్ అలీ, మండల పరిషత్ సూపరింటెండెంట్ అల్లూరి లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, ఏఆర్వోలు తణుకు నాగేశ్వర్ రావు, ఎన్ లచ్చన్న, రాజేశం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్నికల బందోబస్తును మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట, దేవాపూర్ ఎస్సైలు ఆంజనేయులు, గంగారాం పర్యవేక్షించారు.