కాగజ్నగర్టౌన్, జనవరి 28 : పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల (ఎస్పీయం)కు చెందిన 1968-69 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శని, ఆదివారాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో రెండు రోజుల పాటు ఆనందంగా గడిపారు.
55 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గురువులు లక్ష్మీనర్సింహారావు, వెంకటయ్య, నారాయణను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ తేరాల కృష్ణారావు, ప్రమీల, శ్రీనివాస్, గురువులు పాల్గొన్నారు.