విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించాలి
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం అవిష్కృతమవుతుందని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు.
- అదనపు కలెక్టర్ రాహుల్
- బెల్లంపల్లి గురుకులంలో జోనల్స్థాయి సైన్స్ఫెయిర్
- ప్రతిభచూపిన విద్యార్థులకు బహుమతులు అందజేత
బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 13 : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం అవిష్కృతమవుతుందని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జోనల్ స్థాయి సైన్స్ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ విద్యార్థి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఎదగాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఆరు అంశాల్లో ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఆరు ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు ఆర్సీవో కే.స్వరూపారాణి తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలను అదనపు కలెక్టర్ రాహుల్ ప్రత్యేకంగా పరిశీలించి గైడ్ టీచర్లను అభినందించారు. ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్,ఆసిఫాబాద్ కోఆర్డినేటర్లు సంగనభట్ల శ్రీనివాస్, పోలోజు బాలరాజు, ప్రిన్సిపాల్ సందనరాజ స్వరూప, వైస్ ప్రిన్సిపాల్ పబ్బతిరెడ్డి స్వరూప, రీజియన్ పరిధిలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు ఐనాల సైదులు, ప్రేమరాణి, పచ్చల జ్యోతి, రమేశ్బాబు, ఊటూరి సంతోష్, శ్రీనాథ్, సంగీత, కళాశాల అధ్యాపక, ఉపాధ్యాయులు వేమిరెడ్డి పరమేశ్వరి, కంకణాల సమత, పర్వతాల మంజుల, రాంపల్లి దశరథరామ్, శారద, రంగ శారద, విజయ, స్వప్న, ఆత్రం అపర్ణ, వనజ, శ్రీలత పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

