Suicide | మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం మహంకాళీవాడ వాసి మాదాసు పవన్ కళ్యాణ్ (24) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోటపల్లి ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నూర్ వాసి మాదాసు రాజేశ్వరి-రాజన్నకుమారుడైన కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెన్నూర్ లోని ఒక బట్టల దుకాణంలోని పని చేస్తున్నాడు. ఉదయం బట్టల దుకాణానికి అని ఇంటి నుండి బయలుదేరిన పవన్ కళ్యాణ్ తన అమ్మమ్మ ఊరైన కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి వెళ్ళినట్లు వివరించారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే పవన్ కళ్యాణ్ నోట్లో నుండి నురగలు రావడం కుటుంబ సభ్యులు గమనించారు.
వారు వెంటనే 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌లో పవన్ కళ్యాణ్ ను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవన్ కల్యాణ్ అప్పటికే మృతి చెందినట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతూ ఉంటేవాడని, పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజేందర్ వివరించారు.