బోథ్, జూన్ 29 : దేశ సేవకై యువత ముందుకు రావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల వెలువడిన నేవి ఫలితాల్లో ఉద్యోగం సంపాదించిన మెడిచేల్మ వంశీని శాలువాతో సన్మానించారు. యువత చెడు వ్యసనాల వైపు దృష్టి సారించకుండా చదువుతోపాటు శారీర దారుఢ్యం పెంచుకుంటే ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల్లో ఎంపికవ్వడానికి సులువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షులు స్వామి, సర్పంచ్‌లు రూప్‌చంద్, రవీందర్ జాదవ్, కృష్ణ నాయక్, మేడిచెల్మ ప్రవీణ్, సురేందర్ యాదవ్, ఎలుక రాజు, రాము, సందీప్, ప్రేమ్, సంతోష్ పాల్గొన్నారు.