కుభీర్ : వేడుకకు టెంట్ వేసేందుకు యత్నిస్తుండగా విద్యుత్ షాక్ (Electric Shock ) కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయలయ్యాయి. కుభీర్( Kubeer) మండల కేంద్రానికి చెందిన రాంబోల్ నవీన్, రాంబోల్ శ్యామ్ అనే ఇద్దరు మండలంలోని సిర్పెల్లి తండాలో టెంట్ (షామియానా) వేసేందుకు వెళ్లారు.
టెంటుకు ఇనుప పోల్ బిగిస్తుండగా పైన ఉన్న 11 కెవి విద్యుత్ తీగలు తగిలి రాంబోల్ నవీన్ (24) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . అతడిని కాపాడేందుకు వెళ్లిన శ్యామ్‌కు సైతం గాయాలు కావడంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో నవీన్ మృతి చెందాడు. తండ్రి రాంబోల్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుభీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.