మరో వారం పది రోజుల్లో ఎడారిగా మారనున్న పొలాలుకోటి ఆశలతో వరి సాగు చేసిన ముక్కాసిగూడ రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. గూడెం లిఫ్ట్ పెద్ద కాలువ, కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా నీరందక.. భూగర్భ జలాలు అడుగంటి పొట్ట దశకు వస్తున్న వరి కళ్లముందే ఎండిపోతుండగా, దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.
మంచిర్యాల, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు. మంచిర్యాల జిల్లాలోని గూడెం లిఫ్ట్ పెద్ద కాలువ, కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా నీళ్లొస్తయని ఆశపడి ఎకరంన్నరలో వరిసాగు చేసిండు. ఈ కాలువల నీళ్లు చుట్టుపక్కనున్న ఊర్లలోకి వచ్చినా చాలు.. ఊట ఉంటదనుకున్నడు. ఒర్రెలో పొక్లింగ్తో గుంత చేసి పొలం పారిస్తననుకున్నడు. కానీ, గత యాసంగి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ అటు పెద్దకాలువ నీళ్లు, ఇటు కడెం నీళ్లు చుట్టుపక్కనున్న ఊళ్లలోకి రాలేదు. దీంతో పోయినేడు మాదిరిగానే ఈ ఏడాది కూడా కండ్ల ముందే పంట ఎండిపోతుంటే చూడలేక రూ.రెండు లక్షలు పెట్టి బావి తవ్విస్తున్నడు. గతేడాదే రూ.రెండు లక్షలు ఖర్చు చేసి బోర్ వేయిస్తే అది ఫెయిలైంది.
సరిపడా నీళ్లు రాక పోయినేడు పంట చేతికిరాలేదు. అందుకే ఈసారి బావి తవ్విస్తున్నడు. అంటే రెండేళ్లలో ఎకన్నరం పొలం కోసం రూ.నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టిండు. పోనీ, ఈ ఏడాదైనా బావి తవ్వితే నీళ్లొస్తయనుకుంటే ఇప్పటికే పంటంతా వల్లిపోయింది. ఇప్పుడు నీరు పెట్టినా చేతికొస్తదన్న గ్యారంటీ లేదంటూ చందు నిట్టూర్చాడు. ఇలా ఈ ఒక్క రైతే కాదు.. ముక్కాసిగూడలో అనేక మంది తీవ్రంగా నష్టపోయే దుస్థితి దాపురించింది.అందని భగీరథ నీరు.. బావి నీరే దిక్కు..నీటి కోసం తిప్పలు పడుతున్న గిరిజన బిడ్డలుబజార్హత్నూర్ మండలంలోని చింతకర్ర గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గిరిజన బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులకోసారి మూడు, నాలుగు బిందెలే రావడంతో 40 కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు జాతర్ల, అందుగూడ, కొత్తగూడ గ్రామల్లోని ట్యాంకులు నిండిన తరువాత చింతకర్ర గ్రామానికి చేరుకుంటాయి. దీనికి చింతకర్ర ఎత్తు ప్రదేశంలో ఉండడంతో ట్యాంకు సరిగా నిండకపోవడంతో నీటి ఇబ్బంది ఏర్పడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి నుంచి నిత్యావసరాల కోసం నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటిని సక్రమంగా అందించే విధంగా చూడాలని అడవిబిడ్డలు కోరుతున్నారు.
చెరువులు నింపకే ఎండుతున్న పంటలు..
దండేపల్లి మండలం ముక్కాసిగూడ రైతులకు యాసంగి సాగు నీళ్లు రావాలంటే వానకాలంలో కడెం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నుంచి వచ్చే నీటితో అల్లీపూర్ చెరువును నింపాలి. కానీ, ఈ ఏడాది వానకాలంలో చెరువును నింపలేదని రైతులు చెబుతున్నారు. అల్లీపూర్ చెరువు నిండితే వానకాలం సాగు చేసేటోళ్లం. ఎండాకాలం కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువ నీళ్లు తాళ్లపేట, మాకులపేట వరకు వస్తే అల్లీపూర్ చెరువులో కొంత నీరు ఉండి మా ఒర్రెలో ఊట వస్తుండే. కానీ ఇప్పుడు జన్నారం మండలం తపాల్పూర్ వరకే కడెం నీళ్లు వస్తున్నయ్. అది కూడా 15 రోజులు ఇస్తున్నరు, 15 రోజులు బంద్ చేస్తున్నరు. మా ఊరు దాకా అవి చేరడం లేదు. పోనీ ఇటు పక్కనున్న గూడెం లిఫ్ట్ నీైళ్లెనా వస్తాయనుకుంటే అవి మ్యాదర్పేట్, మామిడిపల్లి వరకే వస్తున్నయ్. అట్లా కాకుండా తాళ్లపేట దాకా ఆ నీరు వస్తే అట్లనన్న ఒర్రెలో ఊట వస్తుండే… దాన్నే తోడుకొని సాగు చేసేటోళ్లం.
దాదాపు రెండు సీజన్లుగా ఆ పరిస్థితి లేదు. అందుకే మా పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారం, పది రోజుల్లో పంటలు పూర్తిగా ఎండిపోతాయని వాపోతున్నారు. దాదాపు 50 ఎకరాలు నీరు లేక ఎండిపోయి ఎడారి అయిపోతాయంటున్నారు. ప్రస్తుతం అల్లీపూర్ చెరువులో కొంత నీరున్నా.. అవి తూము ఎత్తు కంటే దిగువకు ఉన్నాయని, తూములో నుంచి బయటికి వచ్చే నీళ్లు లేవని, చెరువులో పంప్ వేసి తీద్దామంటే చేపలు పెంచేటోళ్లు ఒప్పుకోవడం లేదంటున్నారు. కడెం నీళ్ల మా ఊరు దాకా వచ్చేలా చేయాలంటూ వేడుకుంటున్నరు. గతంలో మాదిరిగా వానకాలంలో చుట్టుపక్కనున్న చెరువులు నింపకపోవడం వల్లే పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు చెప్పుకొస్తున్నారు.
అందని భగీరథ నీరు.. బావి నీరే దిక్కు..
నీటి కోసం తిప్పలు పడుతున్న గిరిజన బిడ్డలుబజార్హత్నూర్ మండలంలోని చింతకర్ర గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గిరిజన బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులకోసారి మూడు, నాలుగు బిందెలే రావడంతో 40 కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు జాతర్ల, అందుగూడ, కొత్తగూడ గ్రామల్లోని ట్యాంకులు నిండిన తరువాత చింతకర్ర గ్రామానికి చేరుకుంటాయి. దీనికి చింతకర్ర ఎత్తు ప్రదేశంలో ఉండడంతో ట్యాంకు సరిగా నిండకపోవడంతో నీటి ఇబ్బంది ఏర్పడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి నుంచి నిత్యావసరాల కోసం నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటిని సక్రమంగా అందించే విధంగా చూడాలని అడవిబిడ్డలు కోరుతున్నారు.
– బజార్హత్నూర్, మార్చి 5కోటి ఆశలతో వరి సాగు చేసిన ముక్కాసిగూడ రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. గూడెం లిఫ్ట్ పెద్ద కాలువ, కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా నీరందక.. భూగర్భ జలాలు అడుగంటి పొట్ట దశకు వస్తున్న వరి కళ్లముందే ఎండిపోతుండగా, దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.