ఈ చిత్రంలో ఎండిపోయిన పొలాన్ని చూపిస్తున్న యువరైతు పేరు గంతుల చందు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కాసిగూడ గ్రామస్తుడు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో యాసంగిలో వేసిన వరిపంట ఎండిపోతున్నది. తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీటి సమస్యతో పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.