కన్నేపల్లి : ఆదిలాబాద్ జిల్లా కన్నేపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC Centre) ఎమ్మెల్యే వినోద్ కుమార్ శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) నాయకులు రాస్తారోకో చేశారు. పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన చోట కాకుండా స్థల మార్పిడి చేసి సబ్స్టేషన్ పరిధిలో నిర్మాణానికి తలపెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఎలాంటి సౌకర్యాలు , కనీసం నీరు కూడా దొరకని స్థలంలో ఆసుపత్రి నిరూపిస్తే వచ్చే రోగులు ఇబ్బందులు పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం బోరు కూడా పడని స్థలంలో ఆసుపత్రి నిర్మాణాలు చేయడం శోచనీయమని అన్నారు. అధికారులు స్పందించి మండల కేంద్రంలోప్రజలకు సౌకర్యంగా ఉన్న గ్రామపంచాయతీ పక్కన ఖాళీ స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిన్న రవి, బండ గణేష్, బీజేపీ నాయకులు పుల్లూరు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.