దండేపల్లి : మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (World Sparrow Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జీవ వైవిద్యంలో పిచ్చుకల ప్రాముఖ్యతను, పిచ్చుకల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మట్టి పాత్రలలో త్రాగునీరు , ప్లాస్టిక్ పాత్రలలో ధాన్యపు గింజలు, వాటి ఆవాసం కొరకు అట్టలతో గూళ్లు ఏర్పాటు చేసి అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న, ఉపాధ్యాయులు శ్యామల, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, విద్యార్థులు పాల్గొన్నారు.