కుభీర్ : ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీడీవో( MPDO ) గంగాసాగర్ రెడ్డి ( Ganga Sagar Reddy ) సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలల్లో అందరిని సమన్వయం చేసుకుంటే పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతాయని పేర్కొన్నారు. గ్రామ సభలు నిధుల వినియోగం, నర్సరీ, పారిశుద్ధ్యం- పరిశుభ్రత, వీధి దీపాల లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, జర్నలిస్టులు అవార్డు గ్రహీత ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.