నిర్మల్ చైన్‌గేట్, జూన్, 13: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌లోని దివ్య గార్డెన్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు, అంగన్వాడీ టీచర్లు బతుకమ్మలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. మహిళలు చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుండడంతో బాలికా విద్యకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. గురుకులాలు, కేజీబీవీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తున్నదని తెలిపారు. మహిళల రక్షణకు షీటీం, సఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.
స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. పదేళ్ల క్రితం అంగన్వాడీ టీచర్లకు రూ.500 గౌరవ వేతనం ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనం రూ.13,500 పెంచడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మహిళకు పోషకాహారం, న్యూట్రిషన్ కిట్టు అందజేస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళా అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, డీఆర్డీఏ సిబ్బందికి అవార్డులు అందజేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.20 కోట్ల చెక్కును, స్త్రీనిధి రుణాలు రూ. 5 కోట్ల చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఆర్డీవో స్రవంతి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, లక్ష్మణచాంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నాయకులు రాంకిషన్‌రెడ్డి, సీడీపీవో నాగమణి, డీఆర్డీఏ అధికారులు, ఐసీడీఎస్, ఐసీపీసీ అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు