బజార్ హత్నూర్ : అంబులెన్స్‌లో మహిళ ప్రసవించి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కదం మానస(25)కు ఉదయం పురిటి నొప్పులు రావడంతో మానస భర్త బాలాజీ 108 అంబులెన్స్ సమాచారం అందించాడు. హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది చేరుకొని గర్భిణిని వాహనంలో అదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమయ్యాయి.
దీంతో 108 సిబ్బంది, కుటుంబ సభ్యులు మానసకు కాన్పు చేశారు. ఇద్దరు కవల పిల్లలు (ఆడబిడ్డలకు) కు జన్మించారని తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నట్టు 108 ఈఎంటి సతీష్, పైలెట్ రాజారాం తెలిపారు. 108 సిబ్బందికి మానస కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jagdish Bhola: 700 కోట్ల డ్రగ్ రాకెట్లో నిందితుడు.. 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్
Anna University | అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు.. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష
Corona Virus | 4 వేలకు చేరువలో కొవిడ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి