తాండూర్ : మండలంలోని మాదారం టౌన్ షిప్ లాల్ బహుదూర్ స్టేడియంలో ఎంసీసీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-20 క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament ) ముగిసింది. మాజీ ఎంపీటీసీ సూరం రవీందర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన బహుమతుల ప్రధానంలో నాయకులు మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని, క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు.
ఈ టోర్నమెంట్ లో మొత్తం 16 టీమ్ లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. విన్నర్‌గా నిలిచిన గంపలపల్లి జట్టుకు మొదటి బహుమతి కింద రూ. 10వేలు నగదు, షీల్డు, రన్నర్‌గా నిలిచిన మాదారం జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ. 5 వేలు నగదు, షీల్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరం దామోదర్ రెడ్డి, బయ్య మొగిలి, రఘునాథ్ రెడ్డి, పుట్ట శ్రీనివాస్, తిరుపతి, సతీష్, రాహుల్, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.