తాంసి : శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తాంసి కొత్త ఎస్సై జీవన్ రెడ్డి ( SI Jeevan Reddy ) పేర్కొన్నారు. బీఆర్ఎస్ ( BRS ) నాయకులు, మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్ నాయకులతో ఎస్సైని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను పటిష్ఠంగా నిర్వహిస్తానని, ప్రజలతో సమన్వయం కొనసాగిస్తూ న్యాయమైన పద్ధతిలో విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని, నేరాలను అరికట్టేందుకు పోలీసు విభాగం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మండలంలో నేరాల నియంత్రణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.
గ్రామాల్లో ఎక్కడైనా అక్రమ దందాలు కొనసాగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. మద్యం, గుట్కా, జర్ధా, తంబాకు వంటి వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాంసి మండల నాయకులు రఘు, రమణ, మలపతి అశోక్, గోవర్ధన్ రెడ్డి, చంద్రన్న,మహేందర్, నాగ రెడ్డి, లక్ష్మీపతి, నర్సింగ్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.