బెల్లంపల్లి రూరల్/బెల్లంపల్లి టౌన్, మార్చి 14 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్నాలలోని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో ఏర్పాట్లు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖనిలో జన్మించి, అక్కడే చదువు పూర్తి చేసి 26 ఏళ్లు సింగరేణిలో ఉద్యోగం చేశానని గుర్తు చేశారు. ప్రజల మద్దతుతో ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. మొదటి నుంచి ఉద్యమ స్ఫూర్తితోనే పని చేశానే తప్ప.. ఏనాడూ పదవులకు ఆశపడలేదని చెప్పారు. ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మార్పు తీసుకువస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తానన్నారు. ఎంపీ వెంకటేశ్‌నేతకాని చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీని వీడాడని, అధినేత కేసీఆర్ ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి పోటీలో నిలిచానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం అందులోనే కొనసాగుతానని చెప్పారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు నాయకులు,కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కరెంటు కోతలతో వ్యవసాయం కష్టంగా మారిందని, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గొమాస శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ ఎంపీపీ పొట్లపల్లి సుభాష్రావ్తో పాటు నియోజకవర్గంలోని పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు , విద్యార్థి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, మార్చి 14 : ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపు నిచ్చారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లిలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. కేసీఆర్‌ను, బంగారంలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పిలుపునిచ్చారు. మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలన్నారు. జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, సహకార చైర్మన్ నీలా రాంచందర్, ఎంటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, చంద్రమౌళి, నాయకులు ఏనుగు తిరుపతిరెడ్డి, మ డావి అనంతరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు మంజులారెడ్డి, కార్యదర్శి మోటూరి వేణు, బోయిని తిరుపతి, అగ్గి సత్తయ్య, అట్టెపల్లి శ్రీనివాస్, పిట్టల సుమన్, చింతల భీమ య్య, రాంటెంకి వాస్దేవ్, జాడి రాంచందర్, జంగు, అజ్మీర తిరుపతి, హన్మంతు, ఆడె శంకర్, దుర్గం సాగర్ పాల్గొన్నారు.
తాండూర్, మార్చి 14 : తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలో ముందు వరుసలో ఉన్నానని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. గురువారం రేచినిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి నివాసంలో మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ కోసమే పుట్టి న ఉద్యమ పార్టీని ప్రజలు గెలిపించుకుంటారని, ఇకడి ప్రజల తరపున పార్లమెంటులో గళం వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని మతాల విశ్వాసాలను, మనోభావాలను కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, వైస్ ఎంపీపీ దాగం నారాయణ, రైతు సమన్యాయ సమితి అధ్యక్షుడు దత్తాత్రేయరావు, మాజీ సింగల్ విండో చైర్మన్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు పురుషోత్తం గౌడ్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
నెన్నెల మార్చి 14 : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని, ప్రజలకు వాస్తవాలను వివరించాలని మాజీ మం త్రికొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం గుండ్లసోమారం లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు మనకెంతో ప్రతిష్టాత్మకమ ని, ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరముందన్నారు. ప్రజలంందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్ఎస్ సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల అధ్యక్షుడు పంజాల సాగర్‌గౌడ్, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, నాయకులు రాంచందర్, ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.