తాంసి : కేసీఆర్ (KCR) ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు వట్టిపోతున్నాయి. దీంతో పంటపొలాలకు నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు (Mattadivagu Project ) ఉన్న ఎడమ కాలువలో ( Left canal ) పిచ్చి మొక్కలు పెరిగాయి.
దాదాపు కిలోమీటర్ల పొడవునా పిచ్చిమొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ కారణంగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించకోతే తమ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో రైతులకు రుణమాఫీ, రైతు బంధు, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు, పలు సంక్షేమ పథకాలు అందించడంతో వ్యవసాయం పండుగలా కొనసాగిందని అన్నారు. నేడు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సాగు నీటి కొరత, రైతు భరోసా నిధుల ఆలస్యం, అర్హులకు రుణమాఫీ అందక, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.