లోకేశ్వరం, ఆగస్టు 20 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తే ప్రజలు ఓటుతో సమాధానం చెప్తారని, కాంగ్రెస్ భరతం పడతామని అన్నారు. ఇప్పటికే ఆరు, ఏడు నెలలు గడుస్తున్నా చెక్కులు రాకపోవడం బాధాకరమన్నారు.
రెండు గంటలపాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐ లలితకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చిన్నరావు, మాజీ ఎంపీటీసీ సాయన్న, రాయాపూర్ కాండ్లీ, సర్పంచ్ వెంకటేశ్, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ దిగంబర్, బిలోలి సర్పంచ్ కడారి రాజు, సోషల్ మీడియా కన్వీనర్ బం డి ప్రశాంత్, నాయకులు పాల గంగాధర్, భోజారెడ్డి, ప్రకాశ్, అనిల్, సందీప్, ప్రవీణ్, రాజు, గంగారెడ్డి పాల్గొన్నారు.