తాంసి : గ్రామీణ ప్రాంతాల శ్రామికులు, రైతు కూలీలకు అండగా నిలబడుతామని ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి (Addi Bhoja Reddy) అన్నారు. తాంసి మండలం లింగుగూడకు చెందిన వ్యవసాయ కూలీ ( Agricultural labourers ) బర్కత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని శనివారం పరామర్శించారు.
బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రైతు కూలీ కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా బర్కత్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేశారు. మాజీ ఎంపీపీ సురకుంటి మంజుల శ్రీధర్ రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, మాజీ సర్పంచ్ గజానన్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.