In-charge Minister Jupally Krishna Rao | ఉట్నూర్ : ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ ఛార్జీ జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13కోట్ల 75లక్షలతో అప్ గ్రేడేషన్ శుక్రవారం ప్రారంభించారు. కాగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ విఠల్ లతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రజలు ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సంబంధిత శాఖ మంత్రితో చర్చించి కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంపై దృష్టిలో పెట్టుకొని రోగాల బారిన పడకుండా మంచి నాన్యమైన ఆహారం తీసుకోవాలని, రోగాలతో హాస్పిటల్ కి రాలేని పరిస్థితులు రావాలన్నారు.
పూర్తి ఉచితంగా విద్యను అందించేందుకు ప్రభుత్వం ఖానాపూర్ నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై డోర్ టూ డోర్ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను ఆదేశించారు. ఆ సమయంలో బోయవాడకి చెందిన పరమేశ్వరి సర్ మా పిల్లలకు చదువులో, జాబ్స్ లలో అవకాశం కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి స్పందిస్తూ ఉద్యోగాల విషయంలో నైపుణ్యాలు ఉండాలని ప్రభుత్వ నోటిఫికేషన్ లకు పూర్తి స్థాయిలో చదువుకోవాలని సూచించారు.
అంతకుముందు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఏజెన్సీకి తలమానికంగా ఉన్న ఉట్నూర్ ఆస్పత్రికి డాక్టర్లు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇక్కడికి డాక్టర్లు రావడం లేదన్నారు. ఈ పోస్టులకు మంజూరు చేయడంతో పాటుగా భర్తీ చేసి ఇక్కడ జాబ్స్ చేసే విధంగా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం అకాల మరణంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించారు. స్థానిక కేబీ కాంప్లెక్స్ పీఎమ్మర్సీ భవనంలో ఆదివాసి పెద్దలతో సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి ప్రోగ్రాం ఉదయం 10.45 జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో 2 గంటలకు ప్రోగ్రాం జరిగింది. మంత్రి ప్రోగ్రాం కోసం ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసి నాయకులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ జాదవ్ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు.