Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
Congress Party | గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గ్రూపులు, గ్రూప్ రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమంతా సతమతమై ఉన్నామని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నామని ఐనేని దీపక్ రావుతెలిపారు.
Congress Party | | ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్ రావు రాజీనామా చేశారు. ఆయన సారథ్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు.
ఈ విషయమై ఐనేని దీపక్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు
మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ ఎస్ యువ నేత భార్గవ్ దేశ్ పాండే నేతృత్వంలో నవంబర్ 1వ తేదీన సాయంత్రం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని తెలిపారు. గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గ్రూపులు, గ్రూప్ రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమంతా సతమతమై ఉన్నామన్నారు.
శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్, మా డీసీసీ ఆఫీస్.. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే బాధ.. అక్కడికి నుంచి ఇక్కడికొస్తే బాధ.. ఎవరూ భరించలేకపోతున్నాం.. కేసీఆర్ 2001లో ప్రపంచమే బిత్తరపోయేలా ఉద్యమం ప్రారంభించారు. ఎందరో యువకులు చనిపోతుంటే.. బలిదానాలు చేస్తుంటే మన కేసీఆర్ 2014లో తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే మనకు 24 గంటల కరెంట్ వచ్చింది.. ఇవాళ కేవలం 7గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఆనాడు 200 రూపాయలున్న పెన్షన్‌ను రూ.2000 చేశారన్నారు. కేసీఆర్ రైతులకు రూ.5 లక్షలు ఇచ్చారు.. కానీ కాంగ్రెస్ హయాంలో ఇవాళ రైతు భీమా జాడనే లేదని ఫైర్ అయ్యారు.
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు
25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్ రావు రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి విస్తృత సేవలు అందిస్తున్నా గుర్తింపు లేదని, గ్రూపు గొడవలతో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
నవంబర్ 1వ తేదీన కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడి
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

