శ్రీరాంపూర్, జూలై 30 : సింగరేణిలో టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌లో విలేకరులతో ఆయన మా ట్లాడుతూ సింగరేణి కార్మికులపై కేసీఆర్కున్న ప్రేమాభిమానాలతోనే ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా 20 వేల మందికి కారుణ్య ఉద్యోగులు ఇచ్చారని, ఈ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. యూనియన్‌లో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ మార్పులు తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తున్నారని చెప్పారు.
అందులో భాగంగానే తనకు టీబీజీకేఎస్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారన్నారు. త్వరలోనే సింగరేణిలో సమావేశం నిర్వహిస్తామని, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, గడ్డం వెంకట్‌రెడ్డి, పానుగంటి వినయ్, సాల్మాన్ పాల్గొన్నారు.