తాండూర్ : కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah ) డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం సోమవారం తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, హామీల అమలులో ఇంకా నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రజలు, యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, నాయకులు మంగపతి సురేష్ బాబు, బోనగిరి చంద్రశేఖర్, మాసాడి శ్రీరాములు, ఎలుక రాంచందర్, గట్టు సంతోష్ కూమార్, జాడి పోషం, అడువాల సత్యనారాయణ, రావుల స్వామి, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.