– ప్రజావాణిలో బూర్గంపహాడ్ ఎంపీడీవోకు బీఆర్ఎస్ శ్రేణుల వినతి
బూర్గంపహాడ్, సెప్టెంబరు 07 : కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం ప్రజావాణిలో బూర్గంపహాడ్ ఎంపీడీవోకు మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బీఆర్ఎస్ శ్రేణులు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మహిళలకు రూ.2500, బీడీ కార్మికులకు పెన్షన్ రూ.4 వేలు, వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణలక్ష్మి, షాధీముబారక్ ఆర్ధికసాయంతో పాటు తులం బంగారం, విద్యార్ధినులకు స్కూటీలు, ఫీజురియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి తదితర హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ దగా పాలన సాగిస్తుందని మండిపడ్డారు.
ఎంపీడీవో కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపి అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భూపెల్లి నర్సింహారావుతో పాటు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నాయకులు కొనకంచి శ్రీను, దారం కృష్ణారెడ్డి, గోనెల నాని, సాదిక్పషా, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, పూర్ణ, బెజ్జంకి కనకాచారి, గుల్మహ్మద్, బానోత్ శ్రీను, మోహన్, పంగి సురేష్, సర్పంచ్లు గుమ్మడి కృష్ణవేణి, బానోత్ సరోజ, రమణ, సాలయ్య, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీలు, 420 హామీలు తక్షణమే అమలు చేయాలని నిరసన