CM Effigy Burnt | అసెంబ్లీ ఘటనపై బిజినేపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
CM Effigy Burnt | అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
బిజినేపల్లి ( నాగర్ కర్నూల్) : అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం ( Revanth reddy Effigy Burnt ) చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ( Bijinepally) మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు మరికొందరు నల్ల రంగు టీ షర్ట్ లు ధరించి అసెంబ్లీకి వెళ్లగా ఎమ్మెల్యేలను అవమానించే విధంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ కూడా నల్ల టీషర్టు ధరించి నిరసన తెలిపారని అన్నారు.కాంగ్రెస్ కు ఒక న్యాయం మరొకరికి ఇంకో న్యాయమా అంటూ నిలదీశారు.
ఒకపక్క అసెంబ్లీకి రావాలని చెప్తూనే మరోపక్క క్రూరత్వంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అన్నారు . ఇలాంటి ఘటనపై బేషరతుగా క్షమాపణలు చెప్పేంతవరకు నిరసనలు తెలుపుతామన్నారు కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, బాలస్వామి, చిన్నారెడ్డి , అల్లోజి బాలస్వామి రాజు , శ్రీనివాసులు, వంశీ నాయక్, మాధవరెడ్డి, శంకర్, ఖదీర్ , శ్రీశైలం లక్ష్మయ్య , కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

