ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ ( Khanapur ) ప్రజలు కాంగ్రెస్ ( Congress ) పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. గెలవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఓటర్ల వ్యతిరేకత వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో ఘోరం ఓటమి పాలయ్యింది . ప్రభుత్వం ఖానాపూర్పట్టణానికి రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ( Integrated school ) మంజూరు చేసింది .
అయితే కాంగ్రెస్ నాయకులు దీనిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు తరలించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను తరలించవద్దని కోరుతూ పట్టణంలోని అన్ని రాజకీయా పార్టీలు, విద్యార్థులు, విద్యావేత్తలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం మున్సిపల్ ఎన్నికలు రావడంతో జేఏసీ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు గాను బీఆర్ఎస్, 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌కు మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేయడం పట్ల జేఏసీ నాయకులు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.