నస్పూర్, మే 10 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, రా్రష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ రచించిన ‘ఓటేద్దాం రండి’ అనే ఓటరు చైతన్య గీతం సీడీని శుక్రవారం తన కార్యాలయంలో కలెక్టర్ బదావత్ సంతోష్ విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక గీతాన్ని రాయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగేశ్వర్ను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయంఅడ్మినిస్ట్రేషన్ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.