ఎదులాపురం, మే 23 : సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న ఐకేపీ వీవోఏ ఉద్యోగుల ఆందోళన శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. ఇందు లో భాగంగా వీవోఏలు మోకాళ్లపై నిల్చొని వినూత్నంగా నిరసనకు దిగారు. కాగా.. పోలీసులు సమ్మె శిబిరం టెంట్‌ను తొలగించడంతో వీవోఏలు నిరసన వ్యక్తం చేశారు.
వీరికి లంబాడా హకుల పోరాట సమితి రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ మద్దతు పలికారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వీవోఏల టెంట్‌ను ఎలా తొలగిస్తారని ర్యాలీగా టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో సీఐ నాగరాజ్ సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. లింగాల చిన్నన్న, తాజొద్దీన్ ఖాన్, అరుణ, లక్ష్మణాచారి, సంజీవని, అరుణ్ కుమార్, హరి ప్రకాశ్ పాల్గొన్నారు.