దండేపల్లి : చట్టాన్ని ఉల్లంఘించి (Violation ) ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ ( SI Tahsinuddin) హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రి వేళల్లో ఎవరూ అనవసరంగా తిరగవద్దని, యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. తల్లిదండ్రులు, యువతులు, మహిళల పట్ల ఎవరైనా దురుసుగాను,అసభ్యంగాను ప్రవర్తిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని,ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.