పల్లెవాసులను పట్టణాలకు చేరవేయడంలో ఆర్టీసీ బస్సులదే ప్రధాన పాత్ర. దాదాపు 90 శాతానికిపైగా ప్రయాణికులు ఎన్ని ఆటోలు, వ్యక్తిగత వాహనాలు ఉన్నా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ప్రధానంగా సుఖమయ ప్రయాణం, ఆర్థిక భారం కాకుండా ఉండడానికి ఆశ్రయిస్తారు. బుధవారం ఉగాది పండుగ సందర్భంగా పల్లెవాసులు సముచితంగా గౌరవించారు.
ఆదిలాబాద్ నుంచి భీంపూర్ మండల సరిహద్దు గ్రామం గుబ్డి రూట్లో వెళ్లే కొత్త ఆర్టీసీ బస్సును అంతర్గాంలో గ్రామస్తులు కాసేపు ఆపారు. దానికి మామిడి తోరణాలు కట్టి.. పూజలు చేశారు. ఎంత ఆధునికత వచ్చినా గ్రామాల్లో చాలా మందికి ఆర్టీసీయే ప్రధాన రవాణా వాహనమని స్థానిక సర్పంచ్ లలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ విఠల్, కండక్టర్ రాజన్నను గ్రామస్తులు సత్కరించారు.
– భీంపూర్, మార్చి 22