జైపూర్, ఫిబ్రవరి 24: జైపూర్ మండలంలోని ఇందారంలో 1113 సర్వే నంబర్లో హద్దు లు గుర్తించేందుకు సోమవారం సర్వేయర్ రా మస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందల సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని తాతలు తండ్రుల కాలంగా తాము ఇక్కడ జీవిస్తుండగా మా ఇండ్ల అడు గు భూమిని ముత్యంరావు వారసుడిగా చె ప్పుకునే ఆనంద్కృష్ణ అనే వ్యక్తి మోసపూరిత పట్టాలు చేసుకున్నాడని స్థానికులు పేర్కొన్నా రు.
మిగులు భూములను (పట్టా లేనివి) రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాలు చేసుకుని సర్వే పేరుతో స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టాలు చూపించి నివాసం ఉంటున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై విచారణ చేపట్టి అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై, ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వే కోసం వచ్చిన సర్వేయర్ తిప్పి పంపించారు. నివాస స్థలాలను తమ పేరుపై పట్టా చేశాకే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.