తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ అంతర్ జిల్లా పోలీస్ చెక్‌పోస్టు ( Check Post ) ను ఎన్నికల అబ్జర్వర్ మనోహర్ ( Observer Manohar)
మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేసి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు.
బారికేటింగ్ విధానం, వాహానాల తనిఖీ చేయవలసిన పద్ధతి, తనిఖీ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా లభించిన డబ్బులు, ఇతర సామాగ్రి, వాటిని స్వాధీనం చేసుకునే విధానాన్ని వివరించారు.
చెక్ పోస్టులో విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అలర్ట్‌గా ఉండాలన్నారు. ఏచిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దన్నారు. అబ్జర్వర్ వెంట తహసీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.