Mancherial | తాండూర్, ఫిబ్రవరి 4 : విద్యాభారతి పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రాత్రి సిల్వర్ జూబ్లీ సంబరాలను అత్యంత వైభవంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించింది.
ఈ సందర్భంగా విద్యాభారతి విద్యాసంస్థల అధిపతి సురభి అగమరావు మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని అన్నారు. ఇక్కడి పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నాల్లో భాగమే విద్యాభారతి పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమపై ఎనలేని నమ్మకాన్ని ఉంచి వెన్నంటి నడిచిన తల్లితండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులతో పాటు తమతో కలిసి ప్రయాణం చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
డైరెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాభారతి అనే చిన్న మొక్కను మా నాన్నగారు అగమరావు నాటారు. మొక్క కాస్తా ఇప్పుడు తాండూర్లో విద్యాభారతి ఎడ్యుకేషనల్ జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అవతరించిందన్నారు. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల స్కిల్స్, వ్యాల్యూస్ అనే నినాదంతో వేలాది మంది ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందిస్తోందన్నారు. నాణ్యమైన విద్య అందించాలనే సదాశయమే విద్యాభారతి ఆశయం అన్నారు.