DGP Shivadhar Reddy | క్రీడల్లో గెలుపోటములు సహజం.. డీజీపీ శివధర్ రెడ్డి
క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్వహించారు.
DGP Shivadhar Reddy | తాండూర్, ఏప్రిల్ 12 : క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఆదివారం చివరి మ్యాచ్ కు డీజీపీ శివధర్ రెడ్డి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఎమ్మెల్యే వినోదతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై విజేతగా నిలిచిన అచ్చలాపూర్ జట్టుకు రూ. 40వేలు, రన్నర్ గా నిలిచిన బోయపల్లి జట్టుకు రూ.20వేల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఆయన పని చేసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. క్రికెట్ పోటీల్లో గెలిచిన, ఓడిన జట్లు ప్రజలందరి మన్ననలు పొందారన్నారు. గెలవని వారు గెలుపుకు ప్రయత్నించాలని క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
నేటి తరం యువత ఇలా క్రీడలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతీ ఒక్క క్రీడాకారునికి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర తరపున క్రీడలను ప్రోత్సహిస్తామని మంచి భవిష్యత్తుతో ముందుకు రావాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే తండ్రి గడ్డం ( వెంకటస్వామి (కాకా) పేరు మీద జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ప్రతి ఒక క్రీడాకారుకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి సర్పంచ్ సుందిల్ల శంకరమ్మ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, తాండూరు సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

