మంచిర్యాల జిల్లాలో వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి వణికిస్తుండగా, పగలంతా ఎండతీవ్రతకు భగభగమండుతున్నది. ఉదయం 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మిట్ట మధ్యాహ్నం 35 నుంచి 38 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉదయం ఏడింటి దాక పొగమంచు తొలగడం లేదు. రాత్రి పదింటి వరకే చలి తీవ్రత పెరుగుతున్నది. ఇక ఇటు చలికి.. అటు ఉక్కపోతకు ప్రజలు సతమతమవుతున్నారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, మంచిర్యాల