ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూలై 19 : వన మహోత్సవం కార్యక్రమ నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, డీపీవో భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో మొకలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొ కలు నాటడం ప్రతి ఒకరూ బాధ్యతగా తీ సుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమానికి 53 లక్షల మొ కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించినట్లు, ఇప్ప టి వరకు 35 శాతం మొకలు నాటడం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల చివరిలోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, ప్రజలు, ప్ర జా ప్రతినిధులు సమన్వయంతో మొకలు నాటి, లక్ష్యాలను పూర్తిచేసేందుకు చర్యలు తీ సుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపీడీవో శ్రీనివాస్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బం ది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్ పనులను అదనపు కలెక్టర్, డీఎం హెచ్‌వో తుకారంతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. మహిళల అభ్యున్నతి కోసం చేయూతనందించే దిశగా ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రారంభించిందని కలెక్టర్ అన్నారు. క్యాంటీన్ త్వరగా ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దవాఖానకు వచ్చే రోగులు, సహాయకులకు క్యాంటీన్ ఉపయోగకరంగా ఉంటుందని, నాణ్యమైన అల్పాహారం, వస్తువులు ఉండేలా చూడాలని తెలిపారు. అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ, దవాఖాన సూపరింటెం డెంట్ చెన్నకేశవులు, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను అదనపు కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, సరుకుల నిల్వలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధ్యాపకులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అనిత, వార్డెన్ చంద్రకళ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.