సిరికొండ ,ఫిబ్రవరి01: బ్యాంకు సేవలను(Bank services) ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ఉత్పల్ దాం కుమార్(Utpal Kumar) తెలిపారు. శనివారం సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామస్తులకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ద్వారా ఎంఎస్ఎంఈ, ముద్ర, పీఎంఈజీపీ బ్యాంకు లోన్లపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రజలు బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసపూరిత మాటలతో అకౌంట్లో ఉన్న డబ్బులను కాజేస్తున్నారని, ఓటీపీలు లింకులను అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దన్నారు. ఏదైనా సందేహం ఉంటే బ్యాంకుకు వచ్చి సంప్రదించాలన్నారు. ప్రజల కోసమే బ్యాంకులు పనిచేస్తున్నాయని బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ వినయ్, మాజీ సర్పంచ్ పెందూర్ అనిల్ విడ్స్, ఎన్జీవో ఆర్థిక అక్షరస్థ సంస్థ కౌన్సిలర్స్ దంజీ, అరవింద్ గౌడ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..